Categories
ఈ వేసవికి తైలికైన ఆహారం తీసుకొంటే ఎలాటి ఇబ్బందులు ఉండవు అంటున్నారు ఎక్సపర్ట్స్. టమోటో,కీరా ముక్కలు నానపెట్టిన పెసల తో సలాడ్ చేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి కొత్తిమీర తరుగు నిమ్మరసం ఉప్పు జల్లుకొంటే రుచికరమైన స్నాక్ తయారవుతుంది. తరుచుగా నిమ్మరసం కలిపిన నీళ్లు తాగితే ఇందులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని ఇస్తుంది. పెరుగులో కాసిని దానిమ్మ గింజలు చల్లుకొని తింటే రుచితో పాటు పోషకాలు అందుతాయి. అరటి పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది గుండె కొట్టుకోవటం లోని హెచ్చు తగ్గులను నియంత్రిస్తాయి పూర్తిగా జింక్ ఫుడ్ అవతల పెడితేనే అనారోగ్య సమస్యలు రావంటున్నారు ఎక్సపర్ట్స్.