మెలోరా పేరుతో 2016లో నగల వ్యాపారం మొదలుపెట్టారు సరోజ. ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్ లోకి ప్రవేశపెడతారు. ఆ నగలన్నీ తక్కువ బరువు తో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు తగ్గట్లుగా ఉంటాయి. ఈ సంస్థకు సీఈఓ ప్రమోటర్ సరోజినే  ఒక స్టార్టప్ గా అత్యధిక క్రౌడ్ ఫండింగ్ ఫండింగ్ సాధించిన సంస్థగా రికార్డ్ కెక్కింది. నగలంటే కొని లాకర్ లోకి చేర్చటం కాదు రోజువారి వేసుకునేలా డ్రెస్సింగ్ టేబుల్ పైకి చేరాలన్నది నా ఉద్దేశం అంటుంది సరోజ. ఆన్ లైన్ లో వ్యాపార సేవలు ప్రతి పల్లెకి విస్తరించాయి. ఆమె నగలు దేశంలోని నలుమూలలకే సరఫరా అయ్యాయి.

Leave a comment