వర్షాలు కురుస్తుంటే వార్డ్ రోబ్స్ తేమగా మారి బట్టల నుంచి ఒక లాంటి వాసన వేస్తూ ఉంటుంది. ఆ వాసన లేకుండా ఉండాలంటే అలమారాల్లో పేపర్స్ పరవాలి. అవి తేమను పీల్చేస్తాయి. బట్టలు పూర్తిగా ఆరిపోయాకనే కప్ బోర్డ్స్ లో పెట్టాలి. మూలల్లో కీటకాలు చేరకుండా ఎండిన వేపాకులు పెట్టాలి. తేమ ఎక్కువ అనిపిస్తే ఒక ఉప్పు ప్యాకెట్ కత్తిరించి అలమారలో మూల ఉంచాలి లేదా సిలికాన్ జెల్ పాకెట్లు మార్కెట్లో దొరుకుతాయి వాటిని అలమరాలో ఉంచినా తేమ లాగేస్తాయి.

Leave a comment