Categories
ఎండలు అదిరిపోతున్నాయి ఇలాంటి వాతావరణంలో వేసుకొనే డ్రెస్ సింపుల్ గా ,స్టైల్ గా ఉంటే బావుంటుంది. వేసవికి సాధారణంగా తెల్లని బట్టలు చల్లదనం ఇస్తాయంటారు. అలాంటప్పుడు వైట్ టాప్ తో ఏ ముదరు రంగు మ్యాచింగ్ ఫ్యాంట్ వేసిన బాగానే ఉంటుంది. వేడి గాలులకు చక్కని పువ్వుల ప్రింట్స్ బావుంటాయి. భారీ జ్యూవెలరీ లేకుండా సింపుల్ ఇయర్ హ్యాంగింగ్స్ ,పాదాలకు ఫ్లాట్స్ తో తేలిగ్గా ఉంటుంది.అలాగే ఎండకు తట్టుకోవాలంటే చక్కని స్కార్ఫ్ ఉండాల్సిందే. చక్కని తెల్లని టాప్ పైకి నల్ల డిజైన్ ఉన్న స్కార్ఫ్ ఎంతో అందాన్నిస్తుంది.