ఒక అధ్యయనంలో డాక్టర్లు మందులు రాసే తీరు ,పరీక్షలు నిర్దేశించే తీరు ,వారి పని గంటలు పరిశీలించిన తర్వాత ఉదయం వేళ వైద్యుడు ఫ్రెష్ గా ఉన్న సమయంలో రోగులను పరిశీలించినంత నిశితంగా ఆ తర్వాత కాలంలో ఉండదని తేలింది . డాక్టర్ల సమర్థత ఉదయం ఎనిమిది గంటలకు 63.7 శాతం ఉండగా సాయంత్రం అది 47.8 శాతానికి పడిపోతుంది . ఇక మన దేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసే డాక్టర్లు ఉంటారు . వరుసగా రోగులను చూడటంతో డాక్టర్ల మెదడు అలసిపోతుంది . చిన్న పొరపాట్లు జరుగుతాయి . అందుకే ఫ్రెష్ టైమ్ డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకోండి అంటున్నాయి అధ్యయనాలు .

Leave a comment