నీహారికా ,

నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక నా పైన నాకే డౌట్ వస్తుంది అన్నావు నిజం స్వేచ్ఛ ఉన్న చోట సృజన ఉంటుంది. ఊగిసలాట కు ఆస్కారం వుండదు  కాబట్టి లక్ష్యం పైన గురిపెడతాం. నువ్వు గమనించు పెద్ద పెద్ద సంస్థలన్నీ అద్దాల  గనుల్లో పుట్టలేదు.వ్యవస్థాపకుల్లో మేనేజ్మెంట్ దిగ్గజాలు లేరు. వాళ్ళ పెయిన్ ఎవరికీ ఏ  భారీ అంచనాలు లేవు. వాళ్లకు తోచిన ఆలోచనతో ఒక వ్యాపారమో సినేమానో ఎదో ఒక ప్రాజెక్టో మొదలుపెట్టి చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది అవార్డు కోసం తీసే సినిమా అంటూ ఎవళ్ళూ  తీయలేదు.నిర్మాణం  పైన శ్రద్ధ  తో తన చేతిలో ఉన్న కధ పైన నమ్మకంతో నటించే వాళ్ళ పట్ల కూడా నమ్మకంతో సినిమా తీస్తే ఆ సినిమాకు అవార్డులు కలెక్షన్లు వచ్చి తీరతాయి. దక్షిణ కొరియా వంటి చిన్న దేశాలు తలసరి ఉత్పత్తిలో భారత దేశాన్ని మించిపోతున్నారు. ఆ దేశాల్లోని పని సంస్కృతే అంటే వాళ్ళు పనిని ప్రేమించే జీవిత విధానమే పనిని దైవంగా భావించి దీక్షగా చేయటమే వాళ్లకు ఫలితం ఇస్తోంది/ ఆ స్వేచ్చ వాళ్ళకువుంది. నువ్వు పనిచేయాలగలవా అని ముందే సందేహ పడితే రిసల్ట్స్ ఎక్కడ నుంచి వస్తాయి? నువ్వు నీలాగే వుండు నీహారికా . నువ్వు చేస్తున్న పని నువ్వు చదువుతున్న చదువు పట్ల నీకున్న స్వేచ్ఛ నీ టార్గెట్ ని రీచ్ అయ్యేలా చేస్తుంది. నువ్వు కలెక్టర్ ని అవుతాననుకుంటావు. అయిపో. నువ్వు అవుతావా లేదా అని నిన్ను అనుమానించే అవకాశం ఎవ్వరికీ ఇవ్వొద్దు. నువ్వు ముందు సందేహపడద్దు. కష్టపడి చదువు  మహా నైపుణ్యంగా చదువు అదే ప్రపంచం అన్నట్లు చదువు. ఫలితం నీ చేతిలో పడుతుంది.

Leave a comment