ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ  ఫంక్షన్స్ లో కూడా ఏ డిజైనర్ లెహెంగాలే ఫ్యాషన్ అయిపోయాయి. నెటెడ్ సిల్క్ లెహెంగా అయితే ఫ్యాబ్రిక్ దుపట్టా మ్యాచ్ అవుతాయి. లంగా కంటే విశాలమైన కుచ్చిళ్ళతో పాదాల కింద దాకా వచ్చే లెహెంగా డబుల్ కల్చర్ తో అంచు పూర్తిగా కాంట్రాస్ట్ గా కానీ లేదా మల్టీ కలర్ తో గానీ ఉంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఇక పూర్తి ఎంబ్రాయిడరీ తో గాఢమైన రంగులతో లెహెంగా ఉంటె అందమే అందం. నెట్ ఫంక్షన్స్ లో చందమామ కనిపించాలంటే తెల్లని లెహెంగా కు వెండి రంగు అంచు అదే కలర్ బ్లౌజ్ దుపట్టా అయితే రిచ్ లుక్ లో మెరిసిపోవటం ఖాయం. ఏదైనా ప్రత్యేకంగా కనిపించాలంటే డిజైనర్లు కూడా లెహెంగా వైపే చూపిస్తున్నారు.

Leave a comment