Categories
పిల్లల ప్రవర్తనను సాఫ్ట్ డ్రిక్స్ ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల ప్రవర్తన ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. కొన్నిసార్లు బుద్దిగా ఉంటారు ఒక్కో సారి హడావిడి చేస్తారు.ఎందికిలా వాళ్ళ మూడ్స్ మారిపోతాయి అంటే పిల్లలకి సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటుందేమో చూడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శీతల పాణియల్లో ఉండే కెఫిన్ పిల్లలకు నిద్రాభంగం కలిగిస్తుంది.అందుకే పగటి వేళ ఆ అలసటతో చిరాకు పడతారు. నిద్రలేమి అలసట కారణంగానే వాళ్ళలో మూడ్స్ మారుతుంటాయి. అలా అయితే ఎకడమిక్స్ లో కూడా ఏకాగ్రత చూపలేకపోతారు. తినే ఆహారం,విశ్రాంతి నిద్ర పిల్లల మానసిక పరిస్థితి పైన విపరీతమైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.