నిరంతరం పనితో అరచేతులు గరుకుదేరతాయి.ఒక పాత్రలో పంచదార ఆముదం వేసి బాగా కలిపి అందులో కొంచెం నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో అరిచేతులు రుద్దుకుంటే చేతుల్లోని మృతకణాలు పోతాయి.అరచేతుల లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ పంచదార వేసుకొని బాగా రుద్దుకోవాలి.ఆలివ్ ఆయిల్ లో తేమ గుణం ఉంటుంది. పంచదార మంచి స్క్రాబ్ర్ గా పనిచేస్తుంది.ఈ మిశ్రమంతో చేతులను మృదువుగా మారుస్తుంది. వేడి పాలలో,గ్లిజరిన్ కలిపి అందులో రెండు చుక్కల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంతో చేతులు రుద్దుకొన్న మృదువుగా అవుతాయి.