దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. కాఫీ పొడిలో తేనే పసుపు కలిపి రాసుకుని ఓ అరగంట తర్వాత కడిగేస్తే చర్మం శుభ్రంగా కనిపిస్తుంది. పాలు కాఫీ పొడి నెయ్యి కలిపి పూతలా వేసి కాస్సేపటికి కాటన్ తో ఆ పూతను తుడిచేస్తే ముఖం పైన మురికి మృతకణాలు పోయి బావుంటుంది . కాఫీ పొడి నిమ్మరసం కలిపి పూతలా వేసుకుంటే చర్మం ముడతలు లేకుండా ఉంటుంది . ఇది ప్రతి రోజు అన్ని చర్మ తత్వాలున్నవాళ్ళు ట్రై చేయచ్చు. ఇక కాఫీ పొడి మెత్తగా దంచిన దాల్చిన చెక్క పొడి పాలు తేనె కలిపి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ ప్యాక్ గా వేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేస్తె చర్మం కళగా ఉంటుంది.
Categories