Categories
పాపాయికి ఆరు నెలల వయసు దాటాక కొద్ది మొత్తంలో ఘనాహారం పరిచయం చేయండి అంటారు డాక్టర్లు. మింగటం, చప్పరించటం, నమలడం వంటివి ఇప్పుడే చేసేది రకరకాల రుచులు పోషకాలుండే ఆహార పదార్థాలు ఇవ్వాలి. బిడ్డకు ఏడు ఎనిమిది నెలలు వచ్చేసరికి తల్లిపాల నుంచి వచ్చే విటమిన్ సి సరిపోదు కనుక ఈ పోషకాహార ఉండే పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల రసాలు పలుచగా చేసి ఇవ్వాలి. రాగులు, పెసర్లు, గోధుమలతో చేసిన మాల్ట్ చేసి పెట్టొచ్చు. మూడు వంతుల ధాన్యానికి ఒక వంతు పప్పులు కలిపి తయారు చేసుకోవాలి దీన్ని ఉడికించి కాసేపయ్యాక బెల్లం వేసి తినిపించాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగించాలి లేకుంటే మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.