పెరుగు ఆరోగ్యానికి  మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెపితే  తక్కువ  ఖరీదులో పెరుగుతో అందాన్ని మెరుగు పరుచుకొనే చిట్కాలు చెబుతున్నారు సౌందర్యనిపుణులు . ఎండలో ఎక్కువ సేపు ఉంటే చర్మం నల్లగా మారటం  జుట్టు చిట్లిపోవడం సహజం  .అలాంటపుడే  పెరుగులో  పావు కప్పు  నిమ్మరసం  మూడు టేబుల్‌ స్పూన్ల  ఆలివ్‌ ఆయిల్‌ .కలిపి తలకు పట్టించాలి . ముఖానికి ఫేస్‌  మాస్క్‌లా కూడా వేసుకోవాలి .అరగంట తర్వాత స్నానం చేస్తే ఈ సమస్యలు పోతాయి . పావు కప్పు పెరుగులో  రెండు చెంచాల   ఓట్స్‌ పొడి   చెంచా తేనె కొద్దిగా  నిమ్మరసం  కలిపి మొహం  మెడ చేతులకు  రాసుకోవాలి .మృతకణాలు పోయి చర్మం తాజాగా ఉంటుంది . పావుకప్పు పెరుగులో  నిమ్మరసం , బాదం నూనె  వేసి గంటసేపు  ఫ్రిజ్‌లో ఉంచి , దానితో చేతి గోళ్లకు మసాజ్‌ చేస్తే గోళ్లు చేతుల్లో ఆరోగ్యంగా కన్పిస్తాయి .

Leave a comment