తులసి పూజించే మొక్క మాత్రమే కాదు ఔషధాల గని అంటారు ఆయుర్వేద వైద్యులు. తులసి ఆకురసం, తేనెతో కలిపి తీసుకొంటే దగ్గు తగ్గుతోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తులసిది ప్రధాన స్థానం. కార్తీక మాసం నెల పొడుగుతా దీపం వెలిగిస్తారు. తులసిని లక్ష్మీదేవి ప్రతి రూపంగానే ఆరాధిస్తారు. తులసి సౌందర్య ప్రధాయిని. మొటిమలు నివారించటంలో ముందుంటుంది. తులసి లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ వైరల్ ,యాంటీ బాక్టిరీయల్ గుణాలుంటాయి. పెసరపిండిలో తులసి ఆకుల పొడి ,వేపాకుల పొడి కలిపి తయారు చేసిన సున్ని పిండితో స్నానం చేస్తే ఎలాంటి చర్మవ్యాధులు రావు. చర్మం కాంతి వంతంగా ఉంటుంది.

Leave a comment