Categories
పసుపు,వేప కలిపి వాడినా విడివిడిగా వాడినా సౌందర్య కారకాలే. పసుపును పూజల్లో ,సౌందర్య ఉత్పత్తుల్లో వంటకాల తయారీలో ఇటు ఆరోగ్య ప్రదాయినీగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఆహారంలో పసుపు తీసుకొంటే టాక్సిన్లు బయటికి వెళ్ళిపోతాయి. ఇక వేపచెట్టు వల్ల కలిగే లాభాలకు అంతే లేదు. అసలీ చెట్ల నుంచి వచ్చేగాలి కూడా ఆరోగ్యం ఇవ్వగలదు. వేప చిగుర్లు కొబ్బరి నూనెలో వేసి మరగకాచి రాసుకుంటే దురదలు తగ్గుతాయి. వేప చిగురు,పసుపు ,మంచి నూనె కలిపి నూరి గాయాల మచ్చలు ,మొటిమలు మచ్చలు ఇలా చర్మంపై పడిన ఎలాంటి మచ్చలైనా పోతాయి.