నా జీవితంలో అత్యంత అద్భుతం అనే అనుకునేది 20కి పైగా గిన్నిస్ రికార్డ్ లు బద్దలు కొట్టటం అంటుంది స్పీడ్ ఈటర్ పేరుపొందిన లేహ్ షట్కేవర్ .వయస్సు 28, చక్కగా సన్నగా కనిపిస్తుంది కానీ తిండి కార్యక్రమం మొదలు పెట్టిందీ అంటే మూడు నిమిషాల్లో 10 జామ్ డోనట్స్ లు 6 వేడివేడి రొట్టెలు తినగలదు. లీటర్ గ్రేవి 1.49 నిమిషాల్లో తాగేయగలదు. స్ప్రింగ్ రోల్స్ దేన్నైనా నిమిషంలో తినేస్తుంది సాధారణంగా మగవాళ్లే ఇలా తిండిపోటీల్లో ఉంటారు. కానీ నేను ఏమీ పట్టించుకోకుండా, వెక్కిరించిన వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తా అంటుంది లేహ్ షట్కేవర్.