Categories
శ్రీ రామ రామ రామేతీ..రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం..రామ నామ వరాననే.
భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణం చూచి జన్మ జన్మల పాపం ప్రక్షాళన చేసి ముక్తిపొందుదాం.ఈ రోజు శ్రీ రామ చంద్రమూర్తి జన్మ నక్షత్రం కూడా మనం గమనించాలి.జనక మహారాజు ముద్దుల తనయ జానకీదేవి ని స్వయంవరంలో శివుని విల్లు విరిచి గెలిచి ఏక పత్నివ్రతుడిగా మనకు దర్శనం ఇస్తాడు.శ్రీ మహావిష్ణువు అంశమైన శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
నిత్య ప్రసాదం:కొబ్బరి,పానకం,వడపప్పు.
లోకా సమస్తా సుఖినో భవంతు
-తోలేటి వెంకట శిరీష