గరిమా అరోరా రెండేళ్ళ క్రితం ‘ గా ‘ అనే రెస్టారెంట్ ను బ్యాంకాక్ లో ఏర్పాటు చేసింది. ఇందులో సాంప్రదాయ భారత విధానాల్లో ఆధునిక రుచులు కలిపి వండి వడ్డిస్తారు. సంవత్సరం తిరిగే సరికి ఆమె రెస్టారెంట్ కి మిషెలన్ స్టార్ గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయి అత్యున్నత నాణ్యత ప్రమాణాలు పాటించే రెస్టారెంట్స్ కు ఇలాటి గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు సాధన తోలి భారతీయ మహిళా గరిమా. ఈ ఏడాది ఆసియాలోని 50 ఉత్తమ రెస్టారెంట్స్ లో ‘ గా ‘ రెస్టారెంట్ చోటు సంపాదించింది. గరిమాకు ఆసియన్ బెస్ట్ ఫిమేల్ షెఫ్ ఆఫ్ డి ఇయర్ అవార్డు కూడా లభించింది. పురుషులకే సొంతంగా ఉన్న పాక శాస్త్ర ప్రపంచంలో గరిమా స్టేటస్ పొందగలిగింది.