అన్నింట వివక్షతో పాటు స్త్రీ పురుషులు ఇద్దరూ ఉపయోగించే వస్తువులను కూడా స్త్రీలు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని యు.ఎస్ ఒక అధ్యయనంలో చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై ఈ పింక్ టాక్స్ చాలా కాలంగా అధిక భారం మోపుతోంది. సబ్బులు, లోషన్లు, బ్లేడ్లు వంటివి కొన్ని స్త్రీ పురుషులకు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటిని మహిళలు పురుషుల కంటే ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. కేవలం పింక్ ప్యాక్ లో ఉండటం వల్ల ఇద్దరూ వాడే ఒకే ప్రోడక్ట్ స్త్రీలు ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారని మార్కెటింగ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్ సవాల్ చేసేందుకు ప్రత్యేకమైన చట్టం లేదు కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్టులో దావా వేయచ్చు.

Leave a comment