కేవలం ఏడంటే అంటే ఏడూ మరణాలతో  కరోనా పై విజయం సాధించింది తైవాన్.దాదాపు రెండున్నర కోట్ల జనాభాతో ఉన్న తైవాన్ లో 443 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ ముందుచూపు చాకచక్యం కరోనా పుట్టిన వూహాన్ కు దగ్గరగా ఉన్న తైవాన్ లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించ లేదు.సాంకేతికతను చక్కగా ఉపయోగించుకున్నారు దేశంలోని ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ తీసుకొని జి పి యస్ ఆధారంగా ఎవరెవరు ఎక్కడ తిరిగి వచ్చారో తెలుసుకుని క్వారంటైన్ కు పంపే ఏర్పాటు చేశారు.ఏమాత్రం శ్వాస సంబంధిత సమస్య తలెత్తినా వెంటనే కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకున్నారు సాయ్ ఇంగ్-వెన్ తీసుకుంటున్న జాగ్రత్తల వలనే తైవాన్ క్షేమంగా ఉంది.

Leave a comment