Categories
105 సంవత్సరాల పాపమ్మళ్ సొంత సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఇప్పటికీ విజయవంతంగా నడిపిస్తోంది.1914లో తమిళనాడులోని దేవల పురం గ్రామంలో జన్మించిన పాపమ్మళ్ తెక్కం పట్టి లో నివసిస్తోంది. ఎంతో ఇష్టంతో వ్యవసాయం చేపట్టింది పాపమ్మళ్ పండ్ల మొక్కలు కూరగాయలు మొక్కజొన్న సాగు చేస్తోంది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ప్రత్యేక చర్చల్లో ఆమె ఆహ్వానితురాలు ఇప్పటికీ ఆమె ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంది. ఆమె నూరవ పుట్టినరోజు ను ఆ గ్రామ ప్రజలు పండగలా నిర్వహించారు. కష్టపడే గుణం ఉండాలే గానీ ఏ పని చేసేందుకైనా వయసు అడ్డం కాదని నిరూపిస్తోంది పాపమ్మళ్.