శరీర అవసరాలకు మించి నీళ్ళు తాగటం మంచిది కాదంటున్నారు నిపుణులు. మూత్ర పిండాలు గంటకు లీటర్ నీటిని వడపోయ గలుగుతాయి. అదే సమయంలో లీటర్ నీళ్ళ కన్నా ఎక్కువ తాగితే ఆ ప్రభావం కిడ్నీలతో పాటు ఇతర శరీర కణజాలపైనా పడతాయి. రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల మంచి నీళ్ళు సరిపోతాయి. ఆ నీళ్ళ పరిమితి దాటితే వాటిని బయటకు పంప వలిసిన భారం కిడ్నీల పైన పడుతోంది. దీనితో రక్తం లో సోడియం పలచబడి కణాల్లో వాపు ఏర్పడే అవకాశం వుంటుంది. ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళితే శరీరం ద్రవాలను సంగ్రహించే శక్తి కోల్పోతుంది. పొటాషియం శరీరం నుంచి బయటకు పోతు ఉంటుంది. దాంతో కీళ్ళనొప్పులు ఛాతి నొప్పి రావచ్చు మూత్రం రంగును బట్టి తేడా గమనిస్తూ కావలసిన్ని నీళ్ళు మాత్రం తాగండి అంటున్నారు నిపుణులు.

Leave a comment