ఓం!! హైమ్!! హ్రీమ్!!శ్రీమ్!!శ్రీ మాత్రే నమః

జగన్మాత స్వరూపిణి అయిన శ్రీ లలితా దేవిని స్మరించుకుని మనపై చల్లని చూపులు తల్లి ఆశీస్సులు ఇవ్వమని పూజ చేసుకుందాం రండి సఖులూ!!
యంత్రం అంటే దేవీ రూపం,మంత్రం అంటే నాదం సృష్టించడం.శ్రీ చక్ర స్వరూపిణి అంటే ప్రకృతి.మనం ఏది తలపెట్టిన అమ్మ దయ వుంటే జయమే.శ్రీ చక్రం అంటే మూడు శక్తుల కలయిక, అవే ఇచ్ఛాశక్తి,ఙ్ఞానశక్తి,క్రియాశక్తి.ఇష్టమైన పనిని చేయుట ఇచ్ఛాశక్తి,ఆలోచించి చేసేది ఙ్ఞానశక్తి,పని ముట్లతో చేసేది క్రియాశక్తి.ఈ చరాచర సృష్టికి మూలం ఈ మూడు శక్తులే.శ్రీ చక్రం లో కేంద్ర బిందువులుగా వుండే దేవతలు కామేశ్వరి,వజ్రేశ్వరీ,భగమాలిని.
   “శ్రీ చక్రరాజ సింహాసనేశ్వరీ నమో నమః”
నిత్య ప్రసాదం: కొబ్బరి అన్నం,పొంగలి,పులిహోర,ఉడికించిన శనగలు.

     -తోలేటి వెంకట శిరీష

Leave a comment