ఒక్క సారి పొట్ట అప్సెట్ అవుతోంది.జీర్ణ వ్యవస్థ యధాస్థితికి రావాలంటే బొప్పాయి సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు.ఇందులోని పాపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.అలాగే అరటిపండు కూడా,వాము సోంపు నమ్మిన కషాయం తాగిన మేలు చేస్తుంది. వీటిలోని ఫైటో న్యూట్రియంట్లు పొట్ట ఉబ్బరం తగ్గిస్తాయి జీలకర్ర పొడి మజ్జిగలో వేసుకుని తాగితే అది జీర్ణ సంబంధ స్రావాల విడుదలకు తోడ్పడి జీర్ణక్రియను చక్కదిద్దుతుంది. అల్లం రసం నిమ్మకాయ రసం తో కలిపి తేనె వేసి తాగితే ఫలితం అద్భుతంగా ఉంటుంది.పెరుగు చాలా బాగా పనిచేస్తుంది పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు సాయపడి కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.

Leave a comment