ఈ సృష్టి విచిత్రం మనిషి అంచనాలు అందనంతగా ఉంటుంది. జీవం ఉన్న ప్రతి ప్రాణీ బతుకు పోరుకు దిగుతూనే ఉంటుంది. కొన్ని ఆత్మరక్షణ కోసం కొన్ని రూపలలోకి మారిపోతూంటాయి. అలా బయటపడ్డ ఒక ఎడారిమొక్క లి థాప్స్. ఇవి ఎడారిలో తమ చుట్టుపక్కల ఉండే రాయి రూపంలోనే కనిపిస్తాయి. ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప ఆహారాన్ని నీటిని కడుపులో దాచుకుని అచ్చం రాయిలాగా కనబడే లి థాప్స్ దృష్టికి రావు. పువ్వులు పూస్తేనే ఇవి మొక్కలు అని తెలిసేది.ఇవి ఒక సారి పూశాయా మొత్తం నేలంతా పువ్వులే. వర్షం ఆధారంగా బతికే ఈ రాతి పూల అందం ఇప్పుడు ఇప్పుడు ప్రపంచం అంతా కనిపిస్తుంది వీటిని ఇళ్ళలో పెంచుకుంటున్నారు.