Categories
సమాజం ఎంత మారిన పుస్తక పఠనం పట్ల ఆశక్తి తగ్గకూడదు అనుకొంటారు చాలా మంది . అందుకే కలకత్తా వాసులు హాయిగా నగర వీధుల్లో వీధి లైబ్రరీలు పెట్టేసారు . రకరకాలా పుస్తకాలు కొత్తవీ ,పాతవీ ,కథలు ,నవలలూ ,కవితలు ఏవైనా సరే బీరువాలొంచి తీసుకొని చదువు కోవచ్చు . నచ్చిన పుస్తకం ఇంటికి తీసుకుపోవచ్చు . చదివాకా ఇక్కడే పెట్టేసి ఇంకో పుస్తకం తీసుకోవచ్చు . ఎవ్వరు కాపలా లేకపోయినా ఇక్కడి పుస్తకాలు ఎవళ్ళు ఎత్తుకు పోరు . చక్కగా నీట్ గా సర్దేస్తారు. ఎంతో మంది పుస్తకాలు ఇక్కడికి తెచ్చి పెట్టేస్తారు . కలకత్తా వెళితే ఈ చైన్ లైబ్రరీని తప్పకుండా చూడండి .