Categories
![ఎగిరే తుమ్మెదల్లాంటి పువ్వులాంటి పిల్లలకు ప్రేమించటం ఒక్కటే తెలిసిన విద్య. అందులో పెంపుడు జంతువులంటే ఇక తోబుట్టువులతో ఇష్టంగా వుంటారు. జంతువులతో స్నేహం చేసే పిల్లల మెదడు బహు చురుగ్గా పనిచేస్తుందని కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయం పరిశోధకులు మ్యాట్ కెన్సెల్ చెపుతున్నారు. పైగా వాళ్లకు జంతువుల మహాభావాలు చాలా ఈజీగా అర్ధం అవుతాయట. అవి తమ ప్రేమ అరుపులతో చేష్టలతో ఎలా చెప్పినా పిల్లలు అర్ధం చేసుకుంటారు. దీనితో పాటు పెట్స్ కూడా పిల్లల్ని అంత బాగా ప్రేమిస్తాయి. ఇంట్లో పెంపుడు జంతువులంటే పిలల్లు ఆరోగ్యాంగా ఉంటారు మానసికంగా సంతోషంగా ఉంటారని చెపుతున్నారు. పిల్లల్లో సామాజిక అనుబంధాలు ఎమోషన్ పరంగా పాజిటివ్ స్పందన పెట్స్ తో వస్తుందని తేలింది. పిల్లల భద్రత విషయంలో కూడా పెట్స్ చాలా శ్రద్ధగా వుంటాయని అధ్యయనాలు చెపుతున్నాయి. కాకపోతే ఒక్కటే. పిలల్లు తమకు తాము రక్షించుకునే వయస్సు వచ్చే దాకా తల్లి తండ్రులు వాళ్లనోకంట కనిపెట్టుకొనే ఉండాలని ప్రమాదం అన్న పదానికి పిల్లలకు అర్ధం కూడా తెలియదని చెపుతున్నారు.](https://vanithavani.com/wp-content/uploads/2017/02/pets.jpg)
వృత్తి జీవితం లో ఒత్తిడి తగ్గాలంటే కాసేపు పెట్స్ తో గడిపితే కొత్త ఉత్సాహం వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్ లు. వాటికి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎదుటివారి మనసెరిగి ప్రవర్తిస్తాయి.పెంపుడు జంతువులతో గడిపితే మనిషి శరీరంలో సెరటోనిన్ డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. అవి ఒత్తిడిని ఆందోళనను దూరం చేస్తాయి. పెట్స్ ను ముట్టుకోవటం, హత్తుకోవటం ద్వారా ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు. పెట్స్ ను పెంచుకునే వారి జీవన విధానం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని ఒక పరిశోధన చెబుతోంది.