ఒక సర్వేలో 51శాతం భారతీయ తల్లితండ్రులు తమ పిల్లల కెరీర్ లో ఎదగాలని కోరుకొంటారట అమెరికా, యుకె ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ శాతం 20 మాత్రమే. మరి పిల్లల విజయం వెనుక పెద్ద వాళ్ళ పాత్ర ఏమిటి అంటే వాళ్లకు మార్గ దర్శకత్వం చేయాలి దైర్యం,కరుణ నిజాయితీ విశ్లేషణ కళాత్మక దృక్పథం సమస్యల పరిష్కారం ప్రతిభ ప్రణాళిక నిర్వహణ ఇవన్నీ పిల్లల్లోని సహజ శక్తి నుంచి ఉద్భవించేవే.పెద్దవాళ్లు ఈ శక్తులను వెలికితీస్తూ భయాలను పోగొడుతూ చేయూతనివ్వాలి వారి విజయవంతమైన ప్రయాణానికి కావలసిన విలువలు బోధిస్తూ తగినంత స్ఫూర్తి నింపాలి.కష్టపడి పనిచేసే గుణాన్ని చిన్నతనం నుంచి పిల్లలకు అలరిస్తే చాలు వాళ్లు విజయసోపానాలు ఎక్కినట్లే.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134