బాదం పప్పులంటే మన దృష్టిలో ఆల్మండ్స్ మాత్రమే. ఈ విదేశీ బాదం వాడకం మొదలు పెట్టక మనదేశంలో పెరిగే దేశీయ బాదం చెట్టును మరచిపోయినట్లే . నగరాల్లో కలిపించవు గానీ పల్లెటూర్లలో ప్రతి వీధిలోనూ కనిపిస్తుంది బాదంచెట్టు . బాదం ఆకులతో విస్తర్లు కూడా కుట్టుకొంటారు . దేశీయ బాదం పప్పులు ప్రతి వందగ్రాములకు 575 కిలో క్యాలరీల శక్తి 20 గ్రాముల ప్రోటీన్ ,55.8 గ్రాముల ఫ్యాట్ 11 గ్రాముల పొటాషియం 10 మిల్లి గ్రాముల మెగ్నీషియం ఉంటాయి . రుచికి ఇవి బావుంటాయి . వృద్ధాప్య ఛాయల్ని దూరం చేసే ఈ భాదం గింజలు తప్పకుండా తినాలి . చాలా రుచిగా కూడా ఉంటుందీ  గింజ.

Leave a comment