హైహీల్స్ ఫ్యాషన్ అన్న విషయంలో అమ్మాయిలు ఇంకోమాట చెవిన వేసుకోరు అంచేత సేఫ్టీగా వుండే హైహీల్స్ కు వెళ్లేముందర లోహీల్స్ ను కళ్ళకు అలవాటు చేయాలి. వీటిని లో కిట్టేన్ హీల్స్ అంటారు. ఇవి సురక్షితమైన ఎంపిక. తర్వాత హైహీల్స్ పంప్స్ లేదా వేడ్జస్ విశాలమైన బేస్ తో ఉంటాయి. ప్రత్యేకమైన దుస్తులు వేసుకున్న ఏ సందర్భంలో అయినా హైహీల్స్ పంప్స్ గొప్పగా ఉంటాయి. బయటకు వెళ్ళాలంటే వేడ్జస్ సూట్ అవ్వుతాయి. పైగా ఇవి కళ్ళు పొడుగ్గా ఉన్నాయన్న బ్రాంతినిస్తాయి. అలాగే స్టిలెట్టొస్. ఇవి గ్లామరస్ అద్భుతమైన పొడవాటి ఈ హీల్స్ సూపర్ మోడల్ కళ్ళ రూపాన్నిస్తాయి. సరదాగా వుండే సమ్మర్ డ్రెస్ ధరించినా స్కిన్నీ జీన్స్ వేసుకున్న సూట్ అవ్వుతాయి. స్టైలిష్ సెలబ్రె టీలరూపం ఇస్తాయనడంలో సందేహం లేదు గానీ కళ్ళనొప్పులుంటే మాత్రం ఇవి ధరిస్తే ప్రొబ్లెమ్స్ వస్తాయి. హైహీల్స్ బూట్స్ అయితే జాగ్రత్తగా ద్రేడ్ చేయాలి. జీన్స్ లేదా స్కర్ట్స్ పై మోకాలి వరకు వుండే బూట్లు బాగా నప్పుతాయి.
Categories