బిడ్డకు తల్లి పాలకు మించిన ఆహారం ఇంకోటి లేదు . తల్లైన కొత్తలో బిడ్డకు పాలు ఇవ్వటం ఇబ్బంది అనే ఉద్దేశ్యం తో బయటికి వెళ్ళడం మానేస్తారు . నిజానికి తల్లిపాలు తాగే పిల్లలతో ఇబ్బంది ఉండదు . గంటలకొద్దీ ట్రైన్ లో వెళ్లినా విమానంలో వెళ్లినా పాపాయి కి ఇతర ఆహారంతో పని ఉండదు . బిడ్డకు పాలిచ్చే తల్లి తన మొచేయి పై పల్చని మెత్తని వస్త్రాన్ని వేసుకొంటే బిడ్డ జాకెట్ ని గుంజుతుందనే భయం ఉండదు . పాపాయి కి పాలిస్తూ ఉంటే ఎవరైనా కళ్ళప్పగించి చూస్తూ ఉంటే ఇబ్బందే . అప్పుడు తల్లికి ఒక సలహా ఇస్తున్నారు ఎక్స్ పర్డ్స్ . అలా చూస్తున్న వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూస్తూ స్నేహంగా నమ్రతగా నవ్వండి వాళ్ళే సిగ్గుపడి ,కళ్ళు తిప్పుకోటారు అంటున్నారు అయితే బిడ్డకు పాలిచ్చేందుకు తల్లికి మొహమాటం ఎందుకు .
Categories