Categories
బంగారు రంగులో పార్టీల్లో మెరిసి పోవాలను కొంటే గోల్డ్ లైక్రా చీరెల్ని ఓ సారి చూడండి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. చక్కగా సాగుతూ వంటికి హత్తుకు పోయేలా ఉండే ఈ చీరెల్ని స్టైల్ గా మంచి వర్క్ బ్లౌజ్ తో జత చేసి కట్టుకొంటే బావుంటుంది. ఎరుపు అంచులు బంగారు వర్ణంలో ఈ చీరెలు పట్టు చీరెలకంటే చక్కగా ఉంటాయి. ఈ పార్టీ వేర్ చీరెలతో పెద్దగా ఆభరణాలు కూడా అవసరం ఉండవు. బంగారు వర్ణాలతో ధగధగలాడే ఈ చీరెలకు ,బరువైన కర్ణాభరణాలు చక్కని ఉంగరాలు ధరిస్తే చాలు.