శతరూప మజుందార్‌ కోల్‌కతాలో టీచర్‌ కొన్ని వందల మంది పిల్లల జీవితాల్లో మార్పు కు కారణమైన స్వప్నోపురోన్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించింది.అదే పేరుతో సుందర్ బన్ లో తొలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసింది. 2012లో బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు ఆమె కుటుంబంతో విహారయాత్రకు వెళ్లారు. ఇది ఒక దీవి భారత్ బంగ్లాదేశ్ ల సరిహద్దులో ఉంది. ఏడాది పొడవునా వర్షాలు వరదలతో సతమతమయ్యే ఈ ప్రాంతం వారికి వ్యవసాయ కూలి పనులే ఆధారం పిల్లలకు చదువు స్కూలు అంటూ ఏదీ లేదు వాళ్ళు బీడీలు చుడుతూనే పెద్ద వారవుతారు. ఆ పిల్లల కోసం సుందర్ బన్ లో స్కూల్ పెట్టిన శతరూప అక్కడే పక్కనే ఉండే ఇంకో ఐదు దీవుల్లో పాఠశాలలు తెరిచింది. ఇప్పుడు 1500 మంది పిల్లలు అక్కడ చదువు నేర్చుకుంటున్నారు.

Leave a comment