గర్భవతులుగా ఉన్నప్పుడు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవటం వల్ల చాలా నష్టం అంటున్నారు డాక్టర్లు. చక్కగా డాక్టర్స్ సూచించిన ఎక్స్ ర్ సైజులు చేయవచ్చు . వాకింగ్ చాలా మంచి వ్యాయామం . తేలిక పాటి యోగా ఇన్ స్ట్రక్టర్ గైడైన్స్ తో చేయవచ్చు. అలాగే భార్యభర్తలు కలిసి చేసే విధంగా కొన్ని వ్యాయామాలు సూచిస్తున్నారు ఎక్స్ పర్ట్స్ .అలాగే తేలికపాటి వ్యాయామాలతో పాటు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు చాలా ఆవసరం .గర్భం దాల్చాక పెద్ద వాళ్లు చాలా ఆలవాటుగా ఇద్దరి కోసం తినాలి అంటుంటారు. అలా తింటే అవసరానికి మించి బరువు పెరగటం ఖాయం. చక్కని సమతులాహారం ,తేలికైన వ్యాయామాలు ఆకృతిని పాడు చేయవు.

Leave a comment