బంగారు,ప్లాటినం,వెండి ఆభరణాలు కాంతి తగ్గకుండా కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు. నగల్ని శుభ్రం చేసే బ్రష్ లు మార్కెట్ లో దొరుకుతాయి. ప్లాటినం ఆభరణాలు కొద్దిసేపు సబ్బు నురగ ఉండే నీటిలో ఉంచి మెత్తని బట్టతో తుడిస్తే చాలు. ముత్యాల నగల్ని తడి బట్టతో మెల్లిగా తుడవాలి దూదిలో స్పిరిట్ వేసి మెల్లగా శుభ్రం చేయాలి. టూత్ పేస్ట్ తో రుద్ధి మెత్తని బట్టతో తుడవాలి. బంగాళదుంపల నీటిలో కూడా వెండి నగలను కాసేపు ఉంచి శుభ్రం చేయచ్చు. బంగారు నగలను లిక్విడ్ డిటర్జెంట్ సోప్ నీళ్లలో పది నిమిషాలు ఉంచి తర్వాత మెత్తని బట్టతో తుడిస్తే చక్కగా మెరుస్తూ ఉంటాయి.

Leave a comment