Categories
ఇది నిస్సందేహంగా పురుషాధిక్య సమాజం. ఇక్కడ ఒక స్త్రీ స్వేచ్చగా బతకడం చాలా కష్టం. నెనో కెరీర్ ఎంచుకున్నాను అది చూసే అవకాశం నాకు ఇంట్లో దొరకలేదు. అప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి నానా కష్టాలు పడి నా కాళ్ళ పై నేను నిలబడగలిగాను అంటుంది మల్లికా శెరావత్. ఇది అనుకున్నంత సులభం కాదు. ఈ జర్నీలో నేను ఎంతకష్టపడ్డానో ఎన్ని మాటలు,అవమానాలు అనుభవించానో చెప్పలేను. ప్రపంచం మొత్తం పర్యటించాకే ఇలాంటి ప్రయాణం కొందరికే సాధ్యమని తెలుసుకున్నా. ఒత్తిడి భయాలు ఎదురయ్యే సంఘటనల నుంచి విముక్తి పొందాలని కోరుకునే ప్రతి అమ్మాయికి తొడ్పడాలని ఉంది. మహిళలు గర్వపడుతూ జీవించే సమాజం కోసం పోరాడాలి మనం అంటూ మల్లికా శరావత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.