ప్రకృతి ద్వారా మనకు అందే ప్రయేజనాలు లెక్కకు అందనివి. ఆదుర్ద కోసం నిరాశ వంటి నెగిటివ్ భావాలు మానసిక శక్తిని కుంగదీసే పరిస్థితి వస్తే పాజిటివ్ మార్గానికి నడిపించగలిగేది ప్రకృతి చికిత్సే.పక్షుల కిలకిలా రావాలు అరుణోదయ కాంతులు,చక్కని సహజమైన సువాసనతో పూవ్వులు, నదీ ప్రవాహం,సముద్రపు అలలు ఇలా ఏది చూసినా మనసు పొగిపోతుంది. ఉవ్వెత్తున పడిలేచే సముద్రం దిశగా కనీసం ఒక చక్కని ఫోటోలు అయినా చూస్తే అనంతమైన వాహిని ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ జీవితంలో కష్ట సుఖాలు ఇలాంటివే సుమా అంటుంది. మనం జయించలేని శక్తుల మధ్య ఇంత ప్రశాంతంగా బతుకుతున్నామే కష్టాలోక లెక్క అనిపించిందా చెప్పండి ప్రకృతి ఓదార్పు మన మనసుకు ఉంటుంది.

Leave a comment