సాఫ్ట్ డ్రింక్ పిల్లల ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయంటున్నాయి తాజా పరిశోధనలు. చెప్పిన మాట వినక పోవటం,మొండిగా ప్రవర్తించటం కూడా ఈ ప్రభావం వల్లనే కావచ్చు అంటారు. శీతల పానీయాల్లో ఉండే కెఫిన్ పిల్లలకు నిద్రాభంగం కలిగిస్తుంది. పగటి వేళ వారు అలసటకు గురవుతారు. ఈ ప్రభావం ముఖ్యంగా టీనేజర్స్ లో కనిపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు. నిద్ర లేమి ,అలసట ఫిలీంగ్ ,చిరాకు ఎక్కువ అవుతాయి. చదువులో ఏకాగ్రత పోతుంది. శీతల పానీయాలు ఇష్టమని పదేపదే వాటిని కోరుకొనే పిల్లలను ఆ దారి మళ్ళించి సహాజమైన పళ్ళరసాలు వాళ్ళకు అందుబాటులో ఉంచమంటున్నారు.

Leave a comment