బంగ్లాదేశ్ కు చెందిన గ్రామీణ్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఇంటెల్ కార్పోరేషన్ తో కలిసి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం స్మార్ట్ బ్యాంగిల్స్ రూపొందించింది. ఈ కోయల్ గాజులు చూట్టానికి మామూలు లక్క మట్టి గాజుల్లాగా ఉంటాయి. గర్భవతులు విపరీతమైన కాలుష్యం ఉన్న ప్రదేశంలోకి వెళితే వీటిలోని సెన్సార్లు కాలుష్యాన్ని గుర్తించి బిడ్డకు మంచిది కాదు అని వాయిస్ మేసెజ్ వినిపిస్తుంది. పల్లెల్లో వాడుకొనే కట్టెల పొయ్యి నుంచి వెలువడే పోగలు కార్బన్ మోనోక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భరంలో కూడా కోయల్ గాజు హెచ్చరిస్తుంది. ఇంటర్నెట్ సాయం లేకుండా పని చేసే ఈ గాజుల మొదటి నెల నుంచి పదో నెల వరకు గర్భిణి ఎలాంటి ఆహారం తినాలి,చెకప్ కి ఎప్పుడు వెళ్ళాలి? స్కానింగ్ ఎప్పుడు ? వంగి విషయాలు చెపుతుంది. ఈ కోయల్ గాజుల్ని బంగ్లాదేశ్ తో పాటు మన దేశంలోనూ అమ్ముతున్నారు..

Leave a comment