తీపి ఇష్టమైన వారికి ఈ పరిశోధనా సారాంశం చాలా ఇష్టమై పోతుంది. చాలా కరెక్ట్ ఎసెస్ మెంట్ అనిపిస్తుంది. తాజా పరిశోధన ఏం చెప్పుతుంది అంటే తియ్యని పదార్ధాలు ఇష్టంగా తినే వారిలో ఓ చక్కని సుగుణం ఉంటుందిట. అదే స్నేహం తియ్యని పదార్ధం చూడగానే తినకుండా ఉండలేమానుకునే వాళ్ళు, అంట తియ్యగాను స్నేహం ఇస్తారు. ప్రవర్తన లో మధురమైన మాటలు మాట్లాడటం లోను ముందుంటుందిట. స్వీట్లు ఇష్టమైన వాళ్ళు నవ్వుతూ పలకరిస్తారట. కొత్త వాళ్ళతో స్నేహం చేసుకుంటారు. ఎవరి కష్టాన్నయినా సొంతం చేసుకుని తమదిగా భావిస్తారు. తోటి వాళ్ళకు సాయ పడే గుణం రక్తంలో సహజంగా వుంటుంది కనుకనే తియ్యని పదార్ధాలు ఇష్టపడతారు అంటున్నాయి  అద్యాయినాలు. తియ్యని పదార్ధాలు డిప్రెషన్ మాయం చేస్తాయి కానీ ఇలా తినే వాళ్ళకు, తియ్యగా మాట్లాడినా సరే మధుమేహం గురించి మాత్రం మాన్స్సులో పెట్టుకోండి. తీపి పైన ఇష్టాన్ని తగ్గించికోని, తియ్యని స్నేహం, బాంధవ్యం మాత్రం మనస్సులో నిలుపుకొండంటున్నారు.

Leave a comment