Categories
రొమ్ము కాన్సర్ బాధితురాలు బెంగాల్ కు చెందిన అనన్య ఛటర్జీ . కాన్సర్ తో తన పోరాటాన్ని హాస్యం మిళితం చేసి పుస్తకంగా రాసింది . టేల్స్ ఫ్రమ్ ది టైల్ ఎండ్ పేరుతో ఈ మధ్యనే ఆ పుస్తకం విడుదల అయింది . అడ్వాన్సడ్ స్టేజ్ లో కేన్సర్ తో భాదపడుతూ కీమోధెరఫీ తో ఊడిపోయిన జుట్టుతో ఆ వేదనని చిరునవ్వు తో ఎదుర్కొందీ అమ్మాయి జబ్బు గురించి తెలిశాక ఎంతో పడ్డాను . కానీ ఏడ్చింది చాలు అనిపించింది . భాదపడేందుకు హద్దులు ఉంటాయి . సెల్ఫ్ పీటీ అంతులేని లోయ వంటిది . దానిలోని దిగితే వడ్డుకు చేరటం కష్టం అని తేల్చుకొన్నాను అంటుంది అనన్య చుట్టూ ప్రకృతి శబ్దాలతో మనుష్యులలో ఆనందాన్ని అందాన్ని చూసిందామె . అమె రాసిన విలువైన పుస్తకం వీలైతే చదవండి.