Categories
ఆరోగ్యానికి మేలు చేసే సలాడ్స్ ఒక్కసారి తినేందుకు రుచిగా అనిపించవు. అలాంటప్పుడు కొన్ని పదార్ధాలు జోడిస్తే పోషక విలువలు పోకుండా రుచిగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్,నువ్వుల నూనె, దంచిన వెల్లుల్లి, సోయాసాస్,చిల్లీసాస్, తెనె, తరిగిన అల్లం కలిపితే సలాడ్ రుచిగా అవుతుంది. అలాగే మస్టర్డ్ ఆయిల్,తెనె, యాపిల్ సిడార్, వెనిగర్,ఆలివ్ నునె, ఉప్పు,మిరియాల పొడి కలిపినా బావుంటుంది. లేదా జున్ను కలిపిన సలాడ్ కు కొత్త రుచి వస్తుంది. పైగా ఆరోగ్యం కూడా. మాములుగా కూరగాయలు పండ్ల ముక్కలతో నిండి వుండే సలాడ్ కు ఈ అదనపు రుచిని జోడిస్తే రుచి అదిరిపోతుంది.