జన్డర్ గురించి మాట్లాడేప్పుడు నిత్య చాలా న్యాయంగా వుంటుందంటారు. అమ్మాయిల్ని కారణం లేకుండా వెనకేసుకు రావడం అబ్బాయిలనే తిట్టడం తన ఉద్దేశ్యం కాదంటుంది నిత్యామీనన్ సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ వుండటం లేదనే అభిప్రాయం వస్తే నిత్య నిజమేనంటుంది. ఎక్కడ చుసినా ఇది మగవాళ్ళ ప్రపంచమే. సినిమా ఇండస్ట్రీ అనేమిటి మొత్తం సొసైటీనే ఇలా వున్నప్పుడు. మన కున్న ఒకే ఒక్క అవకాశం అమ్మాయిలుగా మన ప్రత్యేకత నిరూపించుకోవడం మన అభిప్రాయానికి మన్నింపు ఇచ్చి, మనమేమంటున్నామో తెలుసుకోవడం తమ అవసరంగా మగవాళ్ళు భావించే స్ధితికి మనం ఎదగడం ఒకటే ఉపాయం ప్రత్యేకించి మగవాళ్ళకు స్త్రీ ద్వేషం ఉండక పోవచ్చు కానీ, పురుషాదిక్య ప్రపంకాహం కదా అలా ఆడవాళ్ళని తీసి పారేయడం వాళ్ళ అలవాటుఅంది నిత్య. ప్రస్తుతం నిత్య నటిస్తున్న ప్రాణం మళయాళ మూవీ సబ్జెక్ట్ ఇదే.
Categories