Categories
నిండు రంగుల పదార్థాలలోనే ఆరోగ్యం ఉంటుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.ఇంద్ర ధనస్సులో ఉండే అన్ని రంగుల ఆహార పదార్థాలు దైనందిన ఆహారంలో ఉంటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయని చెపుతున్నారు. ఎరుపు,బ్లూ,కలర్ లో ఉండే టమోటో లు ,బెర్రీలు,కమలా, ఆరెంజ్ ,క్యారెట్ వంటి వాటిలో ఉండే లికోపెనె ,యాంథోసియానిన్స్ బెటా కెరోటిన్ వంటి పోషకాలు పుష్కలగా లభిస్తాయి. అయితే అదే సమయంలో తెల్లగా ఉండే కాలిఫ్లవర్ లో క్యాన్సర్ ను ఎదుర్కొనే శక్తివంతమైన గుణాలు ఉంటాయి. తెల్లని వెల్లుల్ని ఉదర రక్షణకు ఎంతో మంచిది. అందుకే రంగు రంగుల పండ్లు ,కూరలుతో పాటు తెల్లని పదార్థాలు తప్పని సరిగా తినాలి.