చాలా మందికి పెద్ద ఉంగరాలు ,దేవుళ్ళబొమ్మలున్న ఉంగరాలు ధరించటం వాటిని ఎప్పుడూ తీయకపోవటం అలవాటు.ఇలాంటి వెడల్పుగా ఉండే ఉంగరాలు వేళ్ళచుట్టు గుర్తులు పడతాయి.పట్టించుకోకపోతే వారి గుర్తులు అలాగే ఉండిపోతాయి. రింగ్ మార్క్ పోయేందుకు అసలు పడకుండా ఉండాలంటేనే జాగ్రత్తలు తీసుకోవాలి.క్రమం తప్పకుండా ఉంగరపు గుర్తులు కనబడే వేళ్ళ రబ్ చేయాలి. వేళ్ళే కదా అని వదిలేయకుండా వాటికి కూడా సన్‌ స్క్రీన్ అప్లైయ్ చేయాలి. తేనె,నిమ్మరసం కలిపి రాయాలి. వారానికి ఒక సారి ఈ మిశ్రమంతో 15 నిమిషాలు మసాజ్ చేయాలి. వేళ్లను క్రమం తప్పకుండా హెర్బల్ ఉత్పత్తులతో మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటే రింగ్ గుర్తులుపోతాయి.

Leave a comment