Categories
గూగుల్ పూర్వ ఉద్యోగి ఆండ్రాయిడ్ కనిపెట్టిన ఆండీ రూబిన్ 2013లో ఒక హోటల్ గదిలో తనను ఎంతో వేధించాడని తన కోరికి తీర్చమని బలవంతపెట్టారని గూగుల్ కంపెనీ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపి ఆండీ రూబిన్ ని గూగుల్ నుంచి తొలగించింది. అయితే న్యూయార్క్ టైమ్స్ ఈ విషయం గురించి వచ్చిన వార్తలో ఆండీ రూబిన్ ని తొలగించినందుకు గూగుల్ అతనికి 90 మిలియన్లు అంటే 665 కోట్లు 75 లక్షల 25వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది. ఈ వార్త విన్న వెంటనే గూగుల్ మహిళా సిబ్బంది లైంగిక దుష్టప్రవర్తన కలిగిన వ్యక్తికి ఇంత డబ్బు ఇవ్వడం ఏమిటని మండిపడ్డారు.