Categories
ముత్యాల హారాల నగనే తెల్లని గుండ్రని మంచి ముత్యాలు అనుకుంటాము కానీ అక్కడక్కడా నొక్కుకుపోయిన ముత్యాలను పూల గుత్తిగా గుచ్చుతు వాటిని యాంటిక్ టెంపుల్ డిజైన్ లాగా తాయారు చేస్తున్నారు. టెంపుల్ జ్యువలరీ డిజైన్స్ విత్ పెరల్స్ చుస్తే అస్సలు ముత్యాల తో ఇన్ని రకాల నగలున్నాయా అనిపిస్తుంది. రత్నాలు కెంపులు కలిపేసి పెద్ద పెద్ద పెండెంట్లతో గుత్తులకొద్ది ముత్యాల తో హారాలు నెక్లెస్లు వున్నాయి. పచ్చలు కెంపులు, ముత్యాల రత్నాలు నొక్కుకునట్లు చిన్న సైజులో గుత్తుల్లా వుంది దానికి టెంపుల్ డిజైన్ పెండెంట్లు తగిలిస్తే ఇంకో కొత్త పరంపర మొదలైనట్ట్ల్ వుంది. పెళ్లి వేడుకల కోసం ఇలాంటిహారాలు ఒక్కసారి చూడండి. గుత్తు పూసల ముత్యాల హారాలు భలే వున్నాయి.