లాక్ డౌన్ సమయంలో గర్భిణీలు,ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా,హాయిగా ఉండాలని,ఎలాటి బెంగ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి చాలు అని చెపుతున్నారు వైద్యులు. బయటికి వచ్చి వ్యాయామం అవకాశం లేదు కనుక,ఇంట్లో గదుల్లో వరండాల్లోనే వ్యాయామం కొనసాగించమని చెపుతున్నారు. శ్రమ కలిగించే వ్యాయామాలు జోలికి పోవద్దు. పరిశుభ్రత పాటించి,ఊపిరి తిత్తుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి నిరాశ, నిస్సత్తవకు గురి కావద్దు. డైటింగ్ వంటివి పొరపాటున కూడా చేయద్దు అనవసరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలి పాల ,పెరుగు ప్రోటీన్లు పండ్లు పసుపు తెనె బెల్లం వంటివి ఆహారం లో భాగంగా తీసుకోవాలి. ఆనందంగా గడపాలి.

Leave a comment