Categories
వేసవిలో కనిపించే టాన్, యాక్నే చర్మ ఛాయలో తేడాలు ఇలా ముఖానికి వచ్చే ఇబ్బందులను చెక్ పెట్టేందుకు తాజా పండ్లు వాడుకోవచ్చు. పుచ్చకాయ జ్యూస్ ఫ్రిజ్ లో పెట్టి బాగా చల్లగా అయ్యాక ముఖానికి పట్టించి కాసేపు ఆగి కడిగిస్తే ఇందులోని పోషకాలు ముఖానికి తాజాగా చేస్తాయి. నేరేడు కాయలను గుజ్జుగా చేసి మొహానికి పట్టిస్తే ఇది చర్మం అలసటను దూరం చేసి చర్మాన్ని మెరిపిస్తుంది. అవకాడో,కీరా గుజ్జుగా చేసి,దానికి కాస్త తేనె కలిపి ముఖానికి రాసి ఓ అరగంట ఆగి కడిగేస్తే వాతావరణం కారణంగా చర్మం పై పడిన దుష్ప్రభావాన్ని తగ్గిస్తాయి. మొటిమలు మచ్చలు పోతాయి.