పెళ్ళి సందర్భాల్లో అన్ని బరువైన,పట్టు చీరెలు ఎందుకంటే ఇక ఆ తర్వాత సందర్భాల్లో  వాటిని కట్టుకోవటం కష్టం అందుకే కొన్ని లైట్ వెయిట్ చీరెలు ఎంచుకోండి అంటున్నారుఫ్యాషన్  డిజైనర్స్ . పట్టు చీరెలు పెళ్ళికి సంబందించిన ప్రధాన వేడుకలకు ఎంచుకొని ఇతర సందర్భాలకు ఫ్యాన్సీగా తేలిగ్గా ఉండే చీరెలు ఎంచుకోవాలి . జార్జెట్ ,కోటా ,ఆర్గాజ్ వంటివి బావుంటాయి . ప్యూర్ పట్టు,ఉప్పాడ కోయంబత్తూర్ సిల్క్ వంటివీ బావుంటాయి . చిన్న అంచుల జార్జెట్స్ సంప్రదాయ టచ్ తెస్తుంది . బెనారస్ పట్టులోనూ లైట్ వెయిట్  చీరెలు దొరుకుతున్నాయి . శాటిన్ డిజిటల్ ప్రింట్స్ శారీస్ కూడా అందంగా ఉంటాయి . వాటి పైన కాంట్రాస్ట్ బ్లావుజ్ కుట్టించుకొంటే అవిపెళ్ళప్పుడే కాదు ఆ తర్వాత కట్టుకునేందుకు చక్కగా ఉంటాయి .

Leave a comment