Categories
తల్లి తన పాపాయికి ఎప్పుడు రక్ష. అలాగే పెద్దయ్యాక పిల్లలు తల్లికి బాసటగా నిలబడటం కూడా సహజం. కానీ ఇప్పుడో గొప్ప రిపోర్ట్,చిట్టి తల్లి కడుపులో ఉండగానే తల్లిని సంరక్షించడం మొదలు పెడుతోందట. గర్భణులకు అనారోగ్యం కలిగితే, గుండె వంటి కీలక అంగాల తో సహా ఇతర ఏ అంగాలలో సమస్య ఉన్న వెంటనే కడుపులో శిశువు అలర్ట్ అవుతుందట తన మూల కణాలను ప్లాసెంటా ద్వారా తల్లి శరీరం లోకి పంపి దెబ్బతిన్న అంగాల మరమ్మత్తు జరిగేలా చేస్తుంది. కడుపులోంచి తల్లిని ఆదుకునేందుకు పిండ దశ నుంచే సిద్ధం అవుతోంది.